కరోనా కవచ్ పాలసీ.. అన్ని కంపెనీలకు అమలు

-

ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం పాకులాడే కంపెనీలకు ఇన్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవెలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఐఏ) కొంచం ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీలకు శుభవార్తను అందించింది. కేంద్రం అమలు చేస్తున్న కరోనా కవచ్ పాలసీలో కరోనా చికిత్స నేపథ్యంలో కంపెనీలకు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు శనివారం జారీ చేశారు.

covid

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా సోకిన ఉద్యోగులకు చికిత్స అందించాలంటే రూ. లక్షల్లో భారం పడుతుంది. చాలా ఆస్పత్రుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటళ్లు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయడం లేదు. అయితే ఈ సమస్యను కరోనా కవచ్ తో చెక్ పెట్టవచ్చు. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా కవచ్ పాలసీని గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీగా విక్రయించి సేవలు పొందవచ్చు.

జూలైలో అమలులో వచ్చిన ఈ స్కీం కేవలం చికిత్సను ఉద్దేశించి ఈ రెండు పాలసీలను భారత మార్కెట్లో విడుదల చేశారు. 105, 195,285 రోజుల కాల పరిమితితో.. అందరికి అనుమతి ఉంది. పుట్టిన పిల్లాడి నుంచి 65 ఏళ్ల వ్యక్తి వరకు ఈ పాలసీలు వర్తిస్తుంది. దీంట్లో రూ.5 లక్షల వరకు బీమా పొందవచ్చు.

కరోనా కవచ్ పాలసీలో బీమా కంపెనీలకు అనుమతి జూలై 21 వ తేదీన లభించింది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేందుకు వీలుగా కరోనా కవచ్ పాలసీలో ‘గ్రూప్’ అనే పదాన్ని చేర్చారు. గ్రూప్ పాలసీ ప్రీమియంలో 5శాతం డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్రూప్ పాలసీతో చిన్న కంపెనీలకు ఊరట లభిస్తుంది. సామాజిక దూరం, సంస్థలో శానిటైజేషన్ చేస్తూ, ఉద్యోగులు మాస్కులు ధరించి ఉద్యోగం చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version