అందుకే ఆమెని పెళ్లి చేసుకుంటున్న : రానా

-

ప్రస్తుతం టాలీవుడ్ లో రానా వివాహం హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా తన ప్రేమ విషయాన్ని బయట పెట్టి అభిమానులందరికీ రానా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.కాగా ఆగస్ట్ 8వ తేదీన రానా మహిక బజాజ్ వివాహం జరగబోతుంది. తాజాగా తన వివాహం గురించి మాట్లాడిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను వివాహం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నాను… నా ప్రేమికురాలు మహిక మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది… ఆమె నాకు నాకు కరెక్ట్ జోడీ అంటూ రానా తెలిపారు.

అంతేకాకుండా తన సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చారు రానా. చిత్ర పరిశ్రమలో నైపుణ్యం లేకపోతే ఎవరూ కూడా రాణించలేరని తెలిపారు. బాహుబలి సినిమా తన సినీ కెరీర్ లో అద్భుత అంకం అంటూ అభివర్ణించిన రానా.. ఆ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.తాను కీలక పాత్రలో నటించిన అరణ్య విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది అంటూ చెప్పుకొచ్చారు రానా.

Read more RELATED
Recommended to you

Exit mobile version