అటు తిరుమల శ్రీవారి ఆలయం ఆదాయం భారీగా పడిపోయింది. కోట్లలో నుంచి లక్షల్లో ఆదాయం తగ్గింది. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో శ్రీవారి ఆలయానికి గత నెల రోజులుగా భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆదాయం పడిపోయింది. తాజాగా రూ. 39 లక్షలు మాత్రమే రావడం గమనార్హం.
మరోవైపు తెలంగాణలో కూడా ఆలయాల ఆదాయం భారీగా తగ్గింది. కోవిడ్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుండటంతో ఆలయాలకు వచ్చే భక్తులు తగ్గిపోయారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించనున్నారు. యాదగిరిగుట్టలో 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. దీంతో అక్కడ షాపుల మూసివేతకు షాప్ ఓనర్ల నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని యాదాద్రి భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ సూచించారు. అత్యవసర, నిత్యావసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని ప్రధాన ఆలయాల్లో కూడా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాలు మూసివేయనున్నారు. దీంతో ఈ రెండు ఆలయాల ఆదాయం కూడా పడిపోతుందని అధికారులు అంటున్నారు.