కరోనా వైరస్ కు సంబంధించి అనేక వేరియంట్ లు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మన దేశంలో కూడా కొన్ని వేరియంట్ లు బయటకు వచ్చాయి. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో N440K వేరియంట్ ఎక్కువగా కనపడుతుంది. ఇది రెండో వేవ్ లో చాలా కీలకంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వేరియంట్ తో చాలా స్పీడ్ గా ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ వేరియంట్, మునుపటి వాటి కంటే కనీసం 15 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమని నిపుణులు గుర్తించారు. ఇండియాలో ఉన్న వేరియంట్ల కంటే B1.617 మరియు B1.618 కన్నా ఇది బలంగా ఉంటుందని గుర్తించారు. మొదటి వేవ్ సమయంలో కాస్త కరోనా కట్టడిలో ఉన్నా సరే రెండో వేవ్ లో మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుందని గుర్తించారు.