కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. భారతదేశంలో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కచ్చితంగా అమలు చేస్తున్నారు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు చెందిన వాళ్లు. వైరస్ ఎక్కడా కూడా విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోపక్క ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారులు. ఇటువంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు చాపల వేట కోసం తమిళనాడు కు వెళ్లి చిక్కుకుపోయినట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు.
వెంటనే తమిళనాడు మత్స్య శాఖకు ఆదేశాలు జారీ చేసి ఆంధ్రా కు చెందిన 30 మంది మత్స్యకారుల బాగోగులను చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కి తమిళనాడు సీఎం హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వాలు ఒకపక్క కరోనా వైరస్ గురించి పోరాడుతున్న టైంలో రాజకీయ నాయకులు ఎవరికి వారు బాధ్యతాయుతంగా రాజకీయాలు చేయకుండా బాధ్యతాయుతంగా నడవడంతో జనం ఉబ్బితబ్బిపోతున్నరు. థాంక్యూ కరోనా మా రాజకీయ నాయకులు ని కలుపుతునందుకు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.