మేము చెప్పేంత వరకూ స్కూళ్ళు తెరవద్దు…

-

కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పేరు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలో కూడా ఇది క్రమక్రమంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అన్ని మెట్రో నగరాలను ప్రభుత్వం అలెర్ట్ చేసింది. బెంగళూరులో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలకు సెలువు ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 10 నుంచి ప్రభుత్వం ఆదేశించే వరకూ పాఠశాలు మూసివేయాలని ఆదేశాల్లో తెలియచేశారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.

కర్ణాటకలోని ప్రాథమిక పాఠశాలలకు తాము సెలవులు ప్రకటించామని కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ అన్నారు. , బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, జిల్లాల పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. చిన్నారులకు కరోనా వైరస్ తో పాటు, అంటు వ్యాధులు వ్యాపించకుండా గట్టిచర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖా మంత్రి సురేష్ కుమార్ వివరించారు.

కరోనా వైరస్ ప్రభావంతో బెంగళూరులో ప్రజలు బయటకు వెళ్లి సంచరించడానికి భయపడుతున్నారు. అయితే వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి భయం అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సంచరించాలన్నా, పిల్లలను బయటకు పంపించాలాన్నా, ముఖ్యంగా సిటీ బస్సులో ప్రయాణించాలన్నా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 890 మందిని కరోనా వైరస్ అనుమానితులను గుర్తించి వారిని పరిశీలనలో ఉంచామని, వీరిలో ఆరుగురిని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు మంత్రి చెప్పారు. కేరళలో ఐదు కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version