జగన్ ను కలిసేందుకు రఘువీరా ప్రయత్నాలు..

-

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారయిందో అందరికి తెలిసిందే..ఒకప్పుడు కాంగ్రెప్ పార్టీలో టికెట్ల కోసం కొట్టుకున్న వారు కూడా మాకు టికెట్లు వద్దంటూ పోటీ చేసేందుకు కూడా భయపడ్డారు. కానీ రఘువీరారెడ్డి మాత్రం ఎంతటి కష్టాల్లోనైనా పార్టీలోనే కొనసాాగారు. అయితే ఆయన త్వ‌ర‌లో వైసీపీ గూటికి చేర‌బోతున్నార‌ని గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వినిపించాయి. అయితే ర‌ఘువీరారెడ్డి ఈ రోజు ఏపీ సీఎం జ‌గ‌న్ ను అపాయింట్‌మెంట్ కోర‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది. ర‌ఘువీరారెడ్డి మొద‌ట్నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి బాగోలేక‌పోయిన కూడా పార్టీ వెంటే న‌డిచారు. అంతేగాక పార్టీ పీసీసీ ప‌ద‌విని చేప‌ట్టి ముందుకు న‌డిపించాడు. ఏడాది క్రితం తన పీసీసీ పదవికి రాజీనామా చేశారు.అయితే కొత్త గా ఎంపిక‌య్యే పీసీసీ అభ్య‌ర్థి విష‌యంలో ప్ర‌తిష్టంభ‌న ఏర్పడ‌టంతో ఆయ‌న తన రాజీనామాను ప‌క్క‌న పెట్టారు. ఇటీవలే శైల‌జ‌నాథ్ కు పీసీసీ ప‌ద‌విని అప్ప‌గించ‌డంతో ఆయ‌న రఘువీరారెడ్డి రాజీనామాకు ఆమోదం ల‌భించింది. అయితే ఈ మ‌ధ్యే మెగాస్టార్ చిరంజీవిని ర‌ఘువీరారెడ్డి క‌ల‌వ‌డం అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగించింది. వీరిద్దరి భేటీతో త్వ‌ర‌లో చిరంజీవి, ర‌ఘువీరారెడ్డి ఇద్దరూ కలిసి వైసీసీ లోకి వెళ్తారనే ప్ర‌చారం కొన‌సాగింది.

ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ ను క‌ల‌వ‌డానికి ర‌ఘువీరా రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నార‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ ర‌ఘువీరారెడ్డి జ‌గ‌న్ ను రాజ‌కీయం కోసం కలవలేద‌ని త‌న ఇంట్లో జరిగే శుభ‌కార్యానికి ఆహ్వానించ‌డం కోస‌మేన‌ని తెలుస్తోంది. ర‌ఘువీరా రెడ్డి త్వ‌ర‌లో త‌న కుమార్తెకు వివాహం చేయ‌నున్నారు. అందులో భాగంగానే సీఎం జ‌గ‌న్ ను ఆహ్వానించేందుకు రఘువీరా అపాయింట్‌మెంట్ తీసుకున్నార‌ని అంటున్నారు. రఘువీరా రెడ్డి జగన్‌ను కలుస్తుండటంతో సోషల్ మీడియాలో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ వివాహానికి ఆహ్వానించేందుకు కలుస్తున్నారని రఘువీరా అనుచరులు చెబుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని క‌ల‌వ‌డం వెనుకల‌ కూడా కార‌ణం ఉంద‌ని అంటున్నారు. అదేంటంటే ర‌ఘువీరా రెడ్డి నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో నూతనంగా నిర్మాణం చేసిన 52 అడుగులు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం మే 29 న ప్రారంభించనున్నారు. అయితే శ్రీ నీలకంటేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్‌గా ఉన్న ర‌ఘువీరా రెడ్డి ఈ వేడుకకు చిరంజీవి దంపతులును ఆహ్వానించారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version