భారతదేశంలో కనుమరుగు అవుతున్న గ్రేట్ అండమనీస్ తెగకు చెందిన పది మంది సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు అని అధికారులు గురువారం చెప్పారు. రిమోట్ ద్వీపసమూహంలోని 10 మందిలో ఆరుగురు కోలుకొని ఇంటి హోం క్వారంటైన్ లో ఉన్నారు అని మిగిలిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు ఎఎఫ్‌పికి తెలిపారు. కేవలం 50 మందికి పైగా మాత్రమే వారు ఉన్నారు.
చిన్న స్ట్రెయిట్ ద్వీపంలో వారు నివాసం ఉంటున్నారు. అక్కడ ప్రభుత్వం వారి ఆహారం మరియు ఆశ్రయాన్ని చూసుకుంటుంది. 4,00,000 జనాభా ఉన్న అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఇప్పటివరకు 2,268 కరోనావైరస్ కేసులు 37 మరణాలు నమోదు అయ్యాయి. రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఆరుగురు తెగ సభ్యులు పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆదివారం ఆరోగ్య అధికారుల బృందాన్ని స్ట్రెయిట్ ద్వీపానికి పంపారు. 37 మందికి పరిక్షలు చేయగా 10 మందికి పాజిటివ్ వచ్చింది.