ప్రాథమిక దశలో పీహెచ్‌సీల్లోనే కరోనా వైద్యం : మంత్రి

-

తెలంగాణలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది. దింతో కరోనా బారినపడే వారి సంఖ్యా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి బారి నుండి ఉపశమనం పొందానికి మందులను వాడుతున్నారు. కరోనా రోగులకు ఉపశమనం కల్పిస్తున్న మందుల కొరత రాకుండా చూస్తామని మంత్రి ఈటెల రాజేందర్ తెలియజేశారు. అంతేకాకుండా ఈ మందులను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్లు చూస్తామని పేర్కొన్నారు.

etala-rajender
etala-rajender

హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో కరోనా కట్టడిలో కొంత మేర దోహదం చేస్తున్న మందులను తయారు చేస్తున్న ఫార్మాకంపెనీల ప్రతినిధులు, డీలర్లతో మంత్రి ఈటల శనివారం సమావేశమయ్యారు. మందుల కొరత రాకుంండా చూసేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అజిత్రోమైసిన్‌, ఆమ్రాక్సిలిన్‌, సిట్రిజన్‌, ప్లెక్సోఫాండిన్‌, పారాసిటమాల్‌, మల్టివిటమిన్‌, విటమిన్‌-డి, జింక్‌, విటమిన్‌-సి, దగ్గు సిరఫ్‌లు బెండ్రాయిల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, తదితర టాబ్లెట్లు, సిరఫ్‌లను అందుబాటులో ఉంచాలని డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ ప్రీతి మీనా, అధికారులను ఆదేశించారు.ప్రాథమిక దశలోనే కరోనాను గుర్తించి వైద్యం అందించేందుకు గ్రామస్థాయిలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news