కరోనా వలన ఇంకా ప్రజలు సతమతం అవుతూనే వున్నారు. ఈ మహమ్మారి నుండి ఎప్పుడు బయటపడతామో తెలియడం లేదు. రోజూ కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది తెలుసుకుందాం.
గడిచిన 24 గంటల్లో మనం చూసుకున్నటైతే 42 వేల 506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం యాక్టివ్ కేసులు అయితే 4,54,118 గా వున్నాయి. మొత్తం కేసులు 3.08 కోట్లు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే గడిచిన 24 గంటల్లో 895 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 37.60 వ్యాక్సిన్స్ అందించడం జరిగింది.
రికవరీ రేటు 97.2 శాతం పెరిగింది. గత 24 గంటల్లో 41,526 మంది రికవరీ అయ్యారు. మన దేశంలో మొత్తం 2,99,75,064 మంది ఇప్పటికి రికవరీ అయ్యారు అని హెల్త్ మినిస్టరీ నివేదిక ద్వారా తెలుస్తోంది.