ఆడియో కలకలం : టీఆర్ఎస్ టికెట్ తనకే అన్న కౌశిక్ రెడ్డి !

-

నోటిఫికేషన్ రాకముందే..హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించగా.. తాజాగా కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. ”టీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ నాకే.. యూత్ కి ఎన్ని డబ్బులు కావాలో నేను చేసుకుంటా. యూత్ సభ్యులకు రూ. 2000 నుంచి రూ. 3000 ఇద్దాం.” అంటూ మాదన్నపేట యువకునితో కౌశిక్ రెడ్డి సంభాషించినట్లు ఓ ఆడియో ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది.

అంతేకాదు ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ ఆడియో పై వివరణ కోరేందుకు మీడియా మిత్రులు ఫోన్ చేసినా.. కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ అటెండ్ చేయలేదని సమాచారం..ఇక కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండటంతో హుజూరాబాద్ లో కొత్త చర్చకు తెరపైకి వచ్చింది. అటు ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా టార్గెట్ చేసిందని జనం చర్చించుకుంటున్నారు. కాగా గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version