కరోనాతో బాధపడుతూ కూడా ఎంజాయ్ చేసిన రోగులు…!

-

పంజాబ్ లోని జలంధర్ లో ఒక ఆసుపత్రిలో పన్నెండు మంది కరోనావైరస్ రోగుల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. పంజాబీ పాటను పాడుతూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జలంధర్ సివిల్ ఆస్పత్రిలో మరో 11 మంది కరోనా సోకిన వ్యక్తుల వీడియోను ఒక రోగి షూట్ చేసారు. వారు తమ ఐసోలేషన్ వార్డులో ఒక టెలివిజన్‌లో ప్లే అవుతున్న పంజాబీ పాటపై చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేసారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, ఫేస్ మాస్క్ ధరించి, పడకలపై కూర్చున్న రోగులు ఈ పాటను ఆస్వాదించారు. “రోగులందరూ సామాజిక దూరాన్ని కొనసాగించారు, వారు పాటను డాన్స్ చేయలేదు అని, అందరూ ఒక చోట చేరలేదని జలంధర్ సివిల్ ఆసుపత్రిలోని సీనియర్ మెడికల్ ఆఫీసర్ కాశ్మీరీ లాల్ వివరించారు. కరోనావైరస్ రోగుల కోసం వార్డులో ఒక టెలివిజన్ సెట్ ఏర్పాటు చేసారు.

వారు అందరూ కూడా ఆ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వారు అందరూ చాలా హుషారుగా ఉన్నారు. అందరూ త్వరలోనే ఇంటికి వెళ్తారని ఆయన వివరించారు. జలంధర్ జిల్లాలో 48 కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. పంజాబ్ లో కరోనా వైరస్ కేసులు అదుపులోనే ఉన్నాయి. మొహాలీలో కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version