అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అధ్యక్ష పీఠం పై కూర్చున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో అందరికీ షాకులిస్తున్నాడు. అయితే గత కరోనా వైరస్ అమెరికాలో విజృంభిస్తున్న నేపథ్యంలో ట్రంప్ మరింతగా ఫ్రస్టేట్ అయిపోతున్నారు. ఇప్పటికే కరోనాని చైనా వైరస్ అని నిప్పులు చెరిగిన ట్రంప్..చైనా కు సహకరించిందని ఆరోపిస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు నిధులు కట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాలో విదేశీయులకు అనుమతి లేదంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇమిగ్రేషన్ రద్దు చేయడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఇఫ్పుడే సంతకం చేసినట్లు తెలిపారు…
దేశంపై కంటికి కనిపించని శతృవు దాడి చేస్తోదని దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.కరోనా వైరస్ వల్లే తాను ఈ సంతకం చేశానన్నారు. తమ దేశంలోని యువత ఉద్యోగాలు కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందిన, అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్లు రద్దు చేశాననన్నారు..
అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య సుమారు 8 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకూ 42,514 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 1939 మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు మరింత భయాందోళణలకు గురి చేస్తోంది..