హైదరాబాద్: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మరీ విజృంభిస్తోంది. కేసులు, మరణాలు అత్యధికంగా నమోదు అవతున్నాయి. గురువారం నాటి కరోనా పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6 వేల 026 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 75 వేలు కాగా మరణాల సంఖ్య 2 వేల 579కు చేరుకుంది. ఇప్పటి వరకూ 3 లక్షల 96 వేల మంది కరోనా చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77 వేల 127 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 11 వందల 15 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్‌లో 418, రంగారెడ్డిలో 403, నల్గొండలో 368 కరోనా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.