ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 14 కేసులు బయటకు వచ్చాయి. దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266 కి చేరుకుంది. కొత్తగా విశాఖ 5, అనంతపురం 3 కర్నూలు మూడు, గుంటూరు 2, పశ్చిమ గోదావరిలో ఒక కేసు నమోదు అయింది.
అత్యధికంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లా కర్నూలు జిల్లా. ఇక్కడ 54 కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. 48 గంటల పాటు కరోనా కర్ఫ్యూ విధించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులపై ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
బందరులో ఒకరు, అనంతపురంలో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కేసులు అత్యధికంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారివే అని తెలుస్తుంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక కేసుల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్ర౦పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.