ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన అధికార వర్గంలో మాత్రం కరోనా భయం తగ్గ లేదు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కరోనా మహమ్మారి బారీన పడ్డారు. అలాగే ఆయన సతిమణీ సుప్రవ కు కూడా పాజిటివ్ అని తెలింది. గవర్నర్ విశ్వభూషన్ హరి చందన్ ఆయన భార్య సుప్రవ రాజ్ భవన లో ఉంటారు కాబట్టి.. రాజ్ భవన్ లో పలువురికి కరోనా నిర్ధరణ పరీక్ష లు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలలో రాజ్ భవన్ లో ఉన్న దాదాపు 10 మందికి కరోనా నిర్ధరణ అయింది. వారిలో రాజ్ భవన్ లో పని చేసే అధికారుల తో పాటు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషఫ్ హరిచందన్ వ్యక్తి గత సిబ్బంది ఉన్నారు.
అయితే వారు అందరూ కూడా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే రాజ్ భవన్ లో మొత్తం 10 మందికి కొవిడ్ నిర్ధరణ కావడం తో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. ఇంకా రాజ్ భవన్ లో పని చేస్తున్న సిబ్బందికి, అధికారులకు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగ కొవిడ్ నిర్ధరణ అయిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నాడు.