ప్రపంచ వ్యాప్తంగా కరోనా నాశనం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 33 లక్షలు దాటాయి కరోన కేసులు. ప్రతీ రోజు కూడా 70 వేల వరకు కేసులు నమోదు కావడం భయపెడుతుంది. ఇది ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియక ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆందోళనలో ఉన్నాయి. దేశాధినేతలకు కూడా కరోనా వైరస్ సోకడం ఇప్పుడు భయపెడుతుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా సోకుతుంది.
పారిశ్రామిక వేత్తలకు, సినీ ప్రముఖులకు కూడా కరోనా వైరస్ సోకుతుంది. తాజాగా మరో దేశ ప్రధానికి కూడా కరోనా సోకింది. రష్యా ప్రధాన మంత్రి మిఖైల్ మిషుస్టిన్ కరోనా బారినపడ్డారు. ఆయన కరోనా పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. గురువారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు.
ఇంటి నుంచే వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. రష్యాలో కోరనా వినాశనం మొదలయింది. ముందు అసలు లేదు అనుకున్న కరోనా అక్కడ ప్రతాపం చూపిస్తుంది. 106,498 కరోనా పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. అక్కడ మరణాల సంఖ్య తో పాటుగా కోలుకునే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కేవలం 11 శాతం మాత్రమే కోలుకుంటున్నారు ఆ దేశంలో. వెయ్యి మంది మరణించారు.