మరో ఇద్దరి ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్…!

-

చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలతో పాటు ప్రజల్ని పాలిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా ఈ కరోనా బారినపడి ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగిందని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేడు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక అందులో నా సహచర ఎమ్మెల్యేలు బల్వీందర్ ధలీవాల్, ధరంబీర్ అగ్నిహోత్రీకి కరోనా సోకినట్లు ఆయన తెలుపుతూ, వారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

corona-positive

పంజాబ్ రాష్ట్ర మంత్రి త్రిపత్ సింగ్ బజ్వా ఇప్పటికే కరోనా బారిన పడ్డారని, అయితే తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో రాష్ట్ర సర్కార్ ఉలిక్కిపడింది. దీంతో పంజాబ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరుకుంది. అలాగే రాష్ట్రంలో ఓ మంత్రి భార్య కుమారుడు కూడా కరోనా సోకినట్టు ఇటీవలే నిర్ధారణ జరిగింది. ఇకపోతే ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా 9792 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 246 మంది మృత్యువాత పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version