కరోనా వైరస్ సామాన్య ప్రజల నుండి ప్రజాపతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాల మంది నాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఇంకా ఈ వైరస్ కారణంగా చాల మంది
నాయకులు కోలుకున్నారు. మరికొంత మంది చికిత్స పొందుతున్నారు.తాజాగా మరో మంత్రి కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ సందేశంలో తెలియజేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకుని తెలిపారు. ఆయన క్వారంటైన్‌కు వెళ్లాలని కోరారు. కొన్ని లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాను. కరోనా పాజిటివ్ అని వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో నన్ను కలుసుకునేందుకు వచ్చిన వారంతా వైద్యపరీక్షలు చేయించుకుని సెల్ఫ్ ఐసొలేషన్‌కు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా శ్రేయాభిలాషులందరికీ ధన్యవాదములు’ అని చౌదరి సందేశం పంపారు.