సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే తన సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకడంతో ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ మేరకు ఆయనకు పాజిటివ్ వచ్చిందని జనసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో పవన్ కళ్యాణ్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని జనసేన టీం కొద్దిసేపటి క్రితం అదికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… వైద్యులు చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో తెలిపారు. ఉదయం పవన్ కు చికిత్స చేసిన వైద్యులు అనంతరం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఊపిరితిత్తులో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా వచ్చిందట. ముందు కరోనా పరీక్షల్లో పవన్ కళ్యాణ్ కు నెగటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. తాజాగా పవన్ కరోనా బారిన పడినట్టు జనసేన ప్రకటించింది. ప్రస్తుతం పవన్ పవన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా, లేదా పరీక్షలు చేయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారా అనే దానిపై క్లారిటీ లేదు.