తెలంగాణాలో ఒకే వ్యక్తికి రెండో సారి కరోనా !

-

తెలంగాణలో ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకినట్టు తెలంగాణా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మొదటిసారి కంటే రెండోసారి కరోనా ప్రభావం తక్కువని అయన పేర్కొన్నారు.
వీటి వలన తెలంగాణలో కూడా కరోనా రి ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అవుతున్నాయని గుర్తించామని అన్నారు. కరోనా వైరస్ లోని ఇతర స్ట్రైన్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయన్న ఆయన రెండోసారి ప్రభావం తక్కువగా ఉంటుందని అన్నారు.

ఇప్పటికే కొన్ని రీ ఇన్ఫెక్షన్ కేసులు తెలంగాణాలో నమోదయ్యాయని అన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని, హైదరాబాద్ లో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. ఆగస్టు చివరి నాటికి తగ్గుతాయని, జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో మరణాలు ఒక శాతానికి తక్కువగా ౦.7 శాతం మాత్రమే ఉందన్న అయన ప్రతి రోజు 40 వేల పరీక్షలు చేస్తున్నామని నిన్న 53 వేల పరీక్షలు చేశామని అన్నారు. మొత్తం పరీక్షల్లో, 50 శాతం పరీక్షలు ఆగస్టు నెలలోనే జరిగాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version