కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపూ లేకుండా పోయింది. క్షణ క్షణానికి అందులో ఫేక్ వార్తలు షేర్ అవుతూనే ఉన్నాయి. దీంతో అసలు వార్త ఏదో, ఫేక్ ఏదో తెలుసుకోవడం జనాలకు కూడా కష్టంగా మారింది. ఇక తాజాగా మరొక ఫేక్ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒక్కో కరోనా పేషెంట్ చికిత్సకు గాను రూ.1.50 లక్షలను ఇస్తుందని, అందువల్లే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, సాధారణ జ్వరం, జలుబు, దగ్గు ఉన్నా దాన్ని కోవిడ్‌గా చిత్రీకరించి మున్సిపాలిటీలు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున కేంద్రం నుంచి నిధులు పొందుతున్నాయని.. వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడైంది.
Is it true??@connectGEETA
This video circulating on what's app & claimed that the municipality/private hospital testing every patient as a covid positive patient to get benefits of 1.5 lakh provided by central govt for every corona positive patient@PIBMumbai @PIBFactCheck
1/1 pic.twitter.com/67zWbMYHAl— प्रकाश मावची Prakash Mavchi پرکاش ماوچی (@Prakash_mavchi) July 21, 2020
@aajtak Viral Sach, it has been stated that every patients of corona give municipality Rs 1.5 lakh is it true? i dont know can you check. Specially its been rumoured in Mira Bhayender Municipal area of Maharashtra near Mumbai
— RAHUL SUREKA (@RahulSureka28) July 19, 2020
కేంద్రం ఒక్కో కరోనా పేషెంట్ చికిత్సకు రూ.1.50 లక్షల చొప్పున మున్సిపాలిటీలకు అందివ్వడం లేదని, ఆ వార్తలో నిజం లేదని, వాటిని నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. నిజానికి అలాంటి ప్రకటనను ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేయలేదు. కనుక ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచిస్తున్నారు.