క‌రోనా త‌ల్లి కాపాడు.. క‌రోనా విగ్ర‌హం ఏర్పాటు.. పూజ‌లు

-

క‌రోనా పేరు వింటేనే ప్యాంట్లు త‌డిసిపోయే ప‌రిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌గా దేశంలో త‌న ప్ర‌తాపం చూపుతోంది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనే తేడా లేకుండా మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. మ‌రి ఈ క‌రోనాకు ముగింపు ఎక్క‌డో తెలియ‌దు గానీ.. ఇప్పుడు క‌రోనాను దేవ‌త‌గా మార్చేశారు కొంద‌రు.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ ఆలయంలో కరోనా విగ్రహాన్ని నిర్మించారు. కామచిపురి ఆధీనంలోని ఈ క‌రోనా విగ్ర‌హానికి ఏకంగా 48రోజులు పూజ‌లు చేస్తున్నారు.

ఏకంగా ఆల‌య అధికారులే ఈ కార్య‌క్ర‌మానికి త‌ల‌పెట్టారు. కాక‌పోతే భ‌క్తుల‌ను రానివ్వ‌ట్లేదు. త‌మిళులు ఏది చేసినా కొంత స్పెష‌లే ఉంటుంది. గ‌తంలో కూడా ప్లేగు వ్యాధికి ఇలాగే విగ్ర‌హం ఏర్పాటు చేశారంట‌. ఇప్పుడు క‌రోనాను కొలుస్తున్నారు. మ‌రి వారి పూజ‌లు ఫ‌లించి క‌రోనా త‌గ్గుతుందో లేదా చూడాలంటూ నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇదో వింత క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news