మీ హెయిర్‌ లాస్‌కు ప్రధాన కారణం?

-

మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకున్నా హెయిర్‌ లాస్‌ అవుతోందా? అది సాధారణ సమస్యే కదా! అని తీసిపారేయకండి. ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతే అనారోగ్య సమస్యలు.. న్యూట్రిషియన్‌ డెఫిషియేన్సీ వంటి ఇతర సమస్యలు కూడా కారణమవుతాయి. దీంతో హెయిర్‌ లాస్‌కు దారితీస్తుంది. డయాబెటీస్‌ ఇతర రోగాలు కూడా హెయిర్‌ లాస్‌కు కారణమవుతాయి. వీరికి రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్యు తగ్గులు ఉంటాయి, దీంతో వారికి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. అందుకే దీనికి సంబంధిత వైద్యులను కలిసి సలహాలు తీసుకోవాలని ప్రముఖ వైద్యురాలు కినితా సూచించారు.


హెయిర్‌ లాస్‌కు కారణాలు

  • ఒకవేళ మీ శరీరంలో కేలరీస్‌ లెవల్‌ తక్కువగా ఉంటే హెయిర్‌ లాస్‌ అవుతుంది. దీంతోపాటు ప్రోటీన్‌ డైట్‌ తక్కువగా ఉండటం.
  • క్రాష్‌ డైటింగ్‌
  • తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గటం
  • జింక్, విటమిన్‌ బీ12, ఐరన్‌ లోపం వల్ల కూడా హెయిర్‌ లాస్‌ అవుతుంది.

ఇలా వెంట్రుకలు ఊడిపోకుండా ఉండటానికి న్యూట్రిషనిస్ట్‌లు కొన్ని సలహాలు సూచించారు. అవేంటో తెలుసుకుందాం.

  • ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో సరైన ప్రోటీన్‌ స్థాయి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్‌లు ఎంతో అవసరం. ఇందులో కెరోటిన్‌ వృద్ధికి తోడ్పటే ముఖ్యమైన బయోటిన్, అమినో యాసిడ్‌లు ఉంటాయి.
  • మీ శరీరంలో జింక్, ఫోలిక్, విటమిన్‌ లోపాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాలి. అందుకే విటమిన్‌ల లెవల్‌ను కూడా ఓసారి పరీక్షలు చేయించుకోవాలి
  • ఒకవేళ హెయిర్‌ లాస్‌ సమస్య మరీ అధికంగా ఉంటే మంచి న్యూట్రిషియనిస్టుని కలవడం మేలని డాక్టర్‌ కినితా సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news