కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తుంది.. మృత్యుఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు, నాయకులు, తారలు, అధికారులు అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తుంది ఈ మహమ్మారి. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. అయితే ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 2,003 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,54,065కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 11,903కు పెరిగింది. 1,55,227 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,935 మంది కోలుకున్నారు.
భారత్ లో కరోనా కలకలం : 24 గంటల్లో 2వేల మంది మృతి..!
-