30 లక్షలు దాటిన కరోనా బాధితులు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశం మాత్రం కనపడటం లేదు. కరోనా కేసులు 30 లక్షలు దాటాయి. సోమవారం కొత్తగా 65819 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3059081గా ఉంది. సోమవారం 4287 మంది కరోనా కారణంగా చనిపోయారు. మృతుల సంఖ్య 211202గా ఉంది ప్రస్తుతం.

గత నాలుగు వారాలుగా మరణాలు రోజు 5వేలకు పైగా ఉన్నాయి. కాని సోమవారం మాత్రం వెయ్యి వరకు తగ్గాయి. అమెరికాలో కరోనా కేసులు తగ్గాయి. మరణాలు కూడా భారీగా తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 1008043కి చేరింది. సోమవారం 20883 కేసులు నమోదు అయ్యాయి. సోమవారం 1236 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 56649 గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు తగ్గే అవకాశం ఉంది.

స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, టర్కీ, ఇరాన్, రష్యా, బ్రెజిల్, కెనడా, ఇండియా, పెరు, సౌదీ అరేబియా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో 28380కి గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, ఢిల్లీ ముందు వరుసలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news