కరోనా మహమ్మారి ఇప్పుడు రాష్ట్రపతి భవనాన్ని కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రపతి భవన్ లో హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. దీనితో 125 కుటుంబాలను సెల్ఫ్ ఐసోలేషన్ కి అధికారులు తరలించారు. కరోనా సోకినా వ్యక్తి కుటుంబానికి పరిక్షలు నిర్వహించారు అధికారులు. దీనిపై ఇప్పుడు ఉన్నత స్థాయి కమిటి రంగంలోకి దిగినట్టు సమాచారం.
పాజిటివ్ వచ్చిన వ్యక్తులు డ్యూటి చార్ట్ ఏంటీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు రాష్ట్రపతి భవన్ లో పని చేసారు, వాళ్లకు అధికారులకు ఏమైనా లింక్ ఉందా… అధికారులతో వాళ్ళు ఏమైనా సన్నిహితంగా ఉన్నారా అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అటు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ భద్రతా సిబ్బంది నుంచి అక్కడ వంట చేసే వాళ్లకు కూడా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. రాష్ట్రపతి కుటుంబానికి వైద్య పరిక్షలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.