రాయలసీమ తెలంగాణా సరిహద్దుల్లో అలజడి, అసలు ఏం జరుగుతుంది…

-

కరోనా వైరస్ ఇప్పుడు తెలుగురాష్ట్రాలను భాగా ఇబ్బంది పెడుతుంది. కరోనా వైరస్ ఎవరికి ఉందో ఎవరికి లేదో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1600 కేసులు నమోదు అయ్యాయి. ఇక రాయలసీమ, తెలంగాణా సరిహద్దు జిల్లాల్లో కరోనా చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణా గద్వాల్, ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి.

కర్నూలు ఆస్పత్రికి వెళ్లి వచ్చిన గద్వాల్ కి చెందిన వారికి కరోనా సోకుతుంది. అక్కడ ఒక ఆస్పత్రి వైద్యుడికి కరోనా ఉండటం అతని నుంచి ఇతరులకు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీనితో తెలంగాణా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరు కర్నూలు వెళ్లి వచ్చారు అనే దాని మీద ఆరా తీస్తున్నారు. గద్వాల్ జిల్లాలో రోజు రోజు కి కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతూ వస్తున్నాయి.

దీనితో తెలంగాణా సర్కార్ ఇప్పుడు జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రానీయకుండా ఇంటికే వెళ్లి కరోనా టెస్ట్ చెయ్యాలి అని భావిస్తుంది. ఒక్క వ్యక్తికి కరోనా బయటపడితే చాలు అందరికి అక్కడ పరిక్షలు చేస్తున్నారు. కాంటాక్ట్ ఉన్న వారు అందరికి పరిక్షలు నిర్వహిస్తున్నారు. గద్వాల్ జిల్లాను పూర్తిగా మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version