ప్రపంచాన్ని కరోనా అంతం చేయబోతోందా …?

-

ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అవును కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. మొన్నటి వరకు చైనాకు పరిమితం అయిన ఈ వైరస్ ఇప్పుడు మరింత వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. ఇటలి, గల్ఫ్ దేశాలకు దీని తీవ్రత పెరుగుతుంది. దక్షిణ కొరియా కూడా ఇప్పుడు ఎక్కువ కేసులతో ఇబ్బంది పడుతుంది. అసలు ఈ వైరస్ తీవ్రత ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు.

చైనా తర్వాత అత్యధిక మంది దక్షిణకొరియాలో ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం కొత్తగా మరో 594 మందికి దక్షిణ కోరియాలో ఈ వైరస్ సోకింది అని గుర్తించారు. అక్కడ బాధితుల సంఖ్య 2,931కి చేరింది. దేగు ప్రాంతంలో మరో ముగ్గురు మహిళలు మరణించడంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. చైనాలో శుక్రవారం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 45 మంది హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే ఉన్నారు.

ఇక కొత్తగా వైరస్ సోకిన వారి సంఖ్య 427కి చేరింది. దీంతో బాధితుల సంఖ్య 79,251కి పెరిగింది. దీనితో ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదు. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి రావాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటలి సహా అనేక దేశాలకు ఈ వైరస్ విస్తఃరించడం తో అమెరికా అవసరమైతే మినహా ఆ దేశాలకు వెళ్లొద్దు అని సూచించింది. దక్షిణ కొరియా సరిహద్దు దేశం ఉత్తరకొరియా కూడా కఠిన ఆంక్షలు విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news