‘హైదరాబాద్’లో కరోనా హైరిస్క్ ప్రాంతాలు ఇవే!

-

కరోనా వైరస్.. తెలంగాణలో ఏ రేంజ్ లో ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కరోనా వైరస్ కేసులు తెలంగాణ మొత్తంలో 80 శాతం కేసులు హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గినప్పటికీ హైదరాబాద్ లో తీవ్ర స్థాయిలో ఉంది అని వైద్యశాఖాధికారులు అధికారులు తెలిపారు.

coronavirus 8 high risk zones in telangana

ఇంకా హైదరాబాద్ లో 500 కేసుల కంటే ఎక్కువ నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా వైద్యశాఖాధికారులు తెలిపారు. ఇంకా 500 వందల కేసులు దాటినా హైరిస్క్ ప్రాంతాలు 8 ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాలు ఇవే..

యూసఫ్ గూడ,
అంబర్ పేట,
మెహదీపట్నం,
కార్వాన్,
చాంద్రాయణ గుట్ట,
చార్మినార్,
కుత్బుల్లాపూర్,
రాజేంద్రనగర్ సర్కిళ్

ఈ 8 ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఇంకా ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి భావిస్తోంది. ఒక్కో హైరిస్క్ ప్రాంతంలో 10 నుంచి 20 వరకు మొత్తంగా 8 ప్రాంతాల్లో 100 వరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసి సిద్ధం అవుతుంది. ఈ ప్రాంతాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version