కరోనా వైరస్ బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. ఇప్పటికే వైరస్‌బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో వైరస్ బారిన పడుతున్న డాక్ట ర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా నిలోఫర్ దవాఖానలో పనిచేసే ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని గాంధీ దవాఖానలో కరోనాకు చికిత్స పొందు తూ మరణించడంతో వారు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్తర్తిస్తున్నారు. కరోనా పోరాటంలో అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పిస్తూ బుధవారం రాత్రి తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణలో ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కలుపుకుని 1,500 మంది వైరస్ బారిన పడ్డారు. అలాగే.. ప్రైవేట్ దవాఖానల్లో మరో వెయ్యిమంది కరోనాకు గురయ్యారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే 12 మంది వైద్య సిబ్బంది మృతి చెందారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు.