దగ్గుతో బాధపడుతున్నారా…? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!

-

శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. దగ్గు లో పలు రకాలు ఉంటాయి – కఫం లేని దగ్గు, పొడి దగ్గు, కఫం తో కూడిన దగ్గు, ఎటువంటి దగ్గు అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. చాలా మందికి తరచుగా జలుబు, దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఇవన్నీ వాతావరణం లో మార్పులు వల్ల జరగవచ్చు లేదా పడని పదార్థం తినడం వల్ల అయినా జరగవచ్చు. అలాంటప్పుడు ఆహారం లోని అల్లం, జీలకర్ర, పసుపు ఎక్కువగా తీసుకోవాలి . ఇలా చేయడం వల్ల ఎటువంటి అలర్జీ అయినా తగ్గిపోతుంది.

మిరియాలు, పచ్చి వక్క, వాము పువ్వు, పచ్చ కర్పూరం, జాజికాయలను తమలపాకులో చుట్టి దవడన పెట్టుకొని దాని లోని రసాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

పొడి దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక గ్లాసు పాల లో చిటికెడు పసుపు 2 లేదా 3 అల్లం ముక్కలు వేసి వేడిగా తాగడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది.

ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి లో, తగినంత తేనె వేసుకుని తినడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు లేదా ఇదే మిశ్రమాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటి లో కలుపుకుని తాగినా అదే ప్రయోజనం ఉంటుంది. ఇలా ఈ సింపుల్ టిప్స్ ని కనుక ఫాలో అయ్యారంటే ఎంతో ఈజీగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version