ఉత్తరాంధ్ర జానపద శిఖరం కుప్పకూలింది. ప్రజాకవి, మాష్టారు వంగపండు ప్రసాదరావు గారు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. పార్వతీపురంలోని తన ఇంట్లో ఆయన కన్ను మూశారు. వందలాది జానపద పాటలు రాసారు ఆయన. ఆయన పాడుతుంటే గిరిజనులు ఆదివాసీలు అందరూ కూడా గజ్జే కట్టి ఆడే పరిస్థితి ఉండేది.
ఆయన మరణంపై సిఎం జగన్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు సిఎం జగన్. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామను పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అని ఆయన పేర్కొన్నారు.
వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామను పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2020