లాక్ డౌన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయం ఏంటీ అనే దాని మీద ఇప్పుడు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ని ప్రకటించారు. నేటితో ఆ గడువు ముగుస్తుంది. లాక్ డౌన్ ప్రకటించిన నాడు దేశంలో రెండు వేల కేసులు మాత్రమే ఉన్నాయి. నేడు పది వేలు దాటింది సంఖ్య. దీనితో మోడీ నిర్ణయంపై ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.
ఆంక్షలను సడలించలేదు అంటే ఆర్ధిక వ్యవస్థ భారీగా కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రజల ప్రాణాలతో పాటుగా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ముఖ్యం అని మోడీ భావిస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయం పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు వారాలు లాక్ డౌన్ కావాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నాయి. లాక్ డౌన్ పై కొత్త గైడ్ లైన్స్ ని ప్రకటించే అవకాశం ఉంది.
దేశాన్ని జోన్స్ గా విభజించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జోన్స్ గా విభజిస్తే లాక్ డౌన్ అమలు చేయడం సులభం అవుతుందని ఆర్ధిక వ్యవస్థ సులభం అవుతుంది అని భావిస్తున్నారు. ఆరెంజ్, గ్రీన్, రెడ్ జోన్లు గా విభజిస్తారు. దీనితో లాక్ డౌన్ ని సడలిస్తే ఆర్ధిక కష్టాల నుంచి బయటకు రావొచ్చని ఆయన భావిస్తున్నారు. కాని ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి పరిస్థితి చాలా భయంకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.