పోలీసుల వేళ్ళు నరికేసిన భార్యా భర్తలు…!

-

దేశంలో లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు మద్యం కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా మద్యం అమ్మకాలు జరగడం లేదు. ఒకటి రెండు రాష్ట్రాలు అమ్ముతున్నా సరే చాలా కట్టుదిట్టంగా అమ్మే పరిస్థితి ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇది పక్కన పెడితే ఒక ఇంట్లో… మద్యం నిల్వ చేసారు అని పోలీసులకు సమాచారం అంది వెళ్ళగా ఇద్దరు దంపతులు పోలీసుల వేళ్ళు నరికారు.

ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. అసలు ఎం జరిగింది అనేది ఈ స్టోరీలో చూస్తే… ఉప్పతర ప్రాంతంలోని ఓ జంట.. అక్రమంగా లిక్కర్ నిల్వ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందగా పోలీసులు వెళ్లి రైడ్ చేసారు. ఈ క్రమంలోనే థామస్ జాన్(34), అనిమోన్ అయ్యప్పన్(33) అనే ఇద్దరు పోలీసులపై భార్యా భర్తలు ఇద్దరూ కూడా దాడికి పాల్పడ్డారు. ఒకరి చేతి వేళ్ళు కూడా నరికేశారు.

దీనిపై స్పందించిన అధికారులు… పోలీసులు రెయిడ్ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని… ఇంట్లోని లిక్కర్‌ను వాళ్ళు డ్రెయిన్‌లో పారబోసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. వారిని అడ్డగించిన థామస్, అయ్యప్పన్‌లపై దాడి చేసినట్టు వివరించారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అక్రమ లిక్కర్ నిల్వ చేయడం, రెయిడింగ్‌కు వచ్చిన పోలీసులపై దాడి చేసిన నేపధ్యంలో కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version