కెనడాలోని లెజెలేలా సఫారీ అనే కంపెనీ అడవిలో సింహాలు, జిరాఫీలు మొదలుకొని అనేక జంతువులను వేటాడి చంపేందుకు అనుమతిస్తుంది. అందులో భాగంగానే చాలా మంది తమలో ఉన్న పైశాచికానందాన్ని తీర్చుకోవడం కోసం అడవిలో అమాయకంగా తిరిగే జంతువులను వేటాడుతుంటారు.
మనం ఎంతైనా మనుషులం కదా.. మనకు మానవత్వం అసలే ఉండదు.. తోటి మనుషుల పైనే మనం జాలి చూపించం.. ఇక జంతువుల గురించి అడిగేదెవరు..? అందుకనే మనం జంతువుల పట్ల క్రూర మృగాల వలె ప్రవర్తిస్తుంటాం. వాటిని హింసిస్తాం.. ఇంకా అవసరమైతే మాంసంలా వండుకుని తింటాం. మరీ పైత్యం తలకెక్కితే వాటిని వేటాడుతాం.. అవును.. ప్రస్తుతం కొందరు మృగ మనుషులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. జంతువులను వేటాడుతూ రాక్షసానందం పొందుతున్నారు. అందుకు కెనడాలోని ఆ ప్రాంతంలో తాజాగా జరిగిన ఓ ఘటనే ఉదాహరణ.
కెనడాలోని లెజెలేలా సఫారీ అనే కంపెనీ అడవిలో సింహాలు, జిరాఫీలు మొదలుకొని అనేక జంతువులను వేటాడి చంపేందుకు అనుమతిస్తుంది. అందులో భాగంగానే చాలా మంది తమలో ఉన్న పైశాచికానందాన్ని తీర్చుకోవడం కోసం అడవిలో అమాయకంగా తిరిగే జంతువులను వేటాడుతుంటారు. ఈ క్రమంలోనే అదే దేశానికి చెందిన డారెన్, కారోలిన్ కార్టర్ అనే ఇద్దరు దంపతులు ఆ అడవిలో వేటాడి ఒక సింహాన్ని చంపారు. ఆ తరువాత దాని వద్దే ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు దిగారు. ఆ తరువాత వారు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అలా ఆ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏమోగానీ.. వారు చేసిన పనిని ఇప్పుడు నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మీరు మనుషులేనా..? ఏమైనా పోయేకాలం దాపురించిందా.. ఇంత వికృతంగా ఎలా ప్రవర్తిస్తారు.. అసలు మీకు మానవత్వముందా.. మనిషి పుట్టుక పుట్టారా..? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆ దంపతుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు ఆ ఫొటోలను ఇప్పటికే తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. అంతేకాదు, తమ ప్రొఫైల్స్‌ను ఎవరూ చూడకుండా ప్రైవేట్ చేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.. అయినా సదరు లెజెలేలా సఫారీ కంపెనీ మాత్రం తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.. ఏం చేస్తాం.. కలికాలం.. ఇలాంటి వాళ్లను భరించక తప్పదు మరి..!