స్ఫూర్తి: ఫారన్​ జీవితం, లక్షల్లో జీతాలు వదిలేసి మరీ ఆర్గానిక్ ఫార్మింగ్…!

-

చాలా మంది విదేశాలకు వెళ్లి స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. విదేశాలకు వెళ్లి బాగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కానీ వీళ్ళ రూట్ మాత్రం సెపరేట్. రవి మంత, కవిత కి సింగపూర్ లో ఉద్యోగాలు వచ్చాయి. పైగా వారి జీతం లక్షల్లో.. విదేశాల్లో ఉంటున్నారు. కానీ ఆ జంటకి అవి అంత ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకని ఉద్యోగాన్ని వదిలేసుకుని హైదరాబాద్ వచ్చేశారు.

ఇక్కడ భూమిని కొనుగోలు చేసి ఒక చిన్న ఫుడ్ ఫారెస్ట్ ని క్రియేట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో 17 ఎకరాలను ఈ జంట కొనుగోలు చేసి చిన్న సైజు ఫుడ్ ఫారెస్ట్ ను మొదలు పెట్టారు. భూమిని కొనుగోలు చేసినప్పుడే ఒక ఆర్గానిక్ స్టోర్ ని కూడా వీళ్ళు కొన్నారు. 15 ఎకరాల్లో పండించిన వాటిని ఇదే స్టోర్లో ఆర్గానిక్ పళ్ళు, కూరగాయలు అందుబాటులోకి తీసుకువచ్చారు. 50 కంటే ఎక్కువ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు.

అలానే 15 రకాల పండ్లు, పప్పులు ధాన్యాలుని కూడా వీళ్ళు పండిస్తున్నారు. వీళ్ళు వ్యవసాయాన్ని చేసేటప్పుడు పర్మాకల్చర్, కొరియన్ సహజ వ్యవసాయం వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అలాగే పొలంలో తేనెటీగలు, పశువులు, సీతాకోకచిలుకలు, వానపాములు మొదలైన వాటిని కూడా పెంచుతున్నారు. ఉద్యోగాలు మానేస్తాం అంటే అందరూ షాక్ అయ్యారు అని.. ఈ పని చేస్తే ఏం వస్తుందని అందరూ ముందు అన్నారని చెప్పారు.

కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఇష్టంతో మొదలుపెట్టిన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ లైఫ్ మారిపోయిందని చెప్పారు. పైగా వాళ్ళు తయారు చేస్తున్న పండ్లను, కూరగాయలను ఏ విధమైన అనుమానం లేకుండా తినొచ్చని 100% ప్రాసెస్ చేయబడిన తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు. నిజంగా వీళ్ళు చాలా మందికి ఆదర్శం అని చెప్పొచ్చు. వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే వ్యవసాయంలో రాణించడానికి బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news