కాలక్షేపానికి మనం ఆలూ చిప్స్ లేదా ఉల్ల గడ్డ చిప్స్ అప్పుడప్పుడు తింటుంటాం. నిజానికి వీటి ఆవిష్కరణ ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసా? దీనికి పెద్ద కథ ఉంది అదేంటో చూద్దాం రండి.

1853 న్యూయార్క్ లోని మూన్ లేక్ లాడ్జ్ లో ఓ పార్టీ జరుగుతోంది. ఆ రాత్రి భోజనానికి ప్రముఖులు హాజరయ్యారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా బంగాళాదుంపల వేపుడు చేశాడు కుక్ జార్జ్ క్రమ్ .

ముక్కలు మరీ మందంగా ఉన్నాయని కూరని కుక్ దగ్గరికి తిప్పికొట్టారు ఆ పార్టీకి వచ్చినవాళ్ళు. కాస్త సన్నగా ముక్కలు తరిగి కూర తయారు చేసి మళ్ళీ పంపాడు. మళ్ళీ మందంగా ఉన్నాయని వాటిని తిప్పి పంపేశారు.

ఇలా పదేపదే తిప్పి పంపుతుండంతో క్రమ్ కి చిర్రెత్తుకోచ్చింది. ఈసారి కాగితం అంత మందం మాత్రమేఉండేలా బంగాళా దుంపల్ని తరిగి ఫోర్క్ కి గుచ్చుకుని తినడానికి వీలు లేకుండా కరకరలాడేలా వేయించి అతిథులకు పంపాడు. ఆ ఐటమ్ వాళ్ళకి తెగ నచ్చేసింది.అలా ఆలూ చిప్స్ వచ్చాయి.
