రూ.5.1 ల‌క్ష‌ల‌తో పిల్లి పిల్ల‌ను కొన్నారు.. పులి అని తెలిసి షాక‌య్యారు..!

-

ఇంట్లో కుక్క లేదా పిల్లి లాంటి పెంపుడు జంతువుల‌ను పెంచుకోవాల‌ని చాలా మందికి స‌ర‌దాగా ఉంటుంది. కానీ ఒక జంటకు మాత్రం ఈ విష‌యంలో చేదు అనుభ‌వం ఎదురైంది. వారు పిల్లి పిల్ల‌ను ఆన్‌లైన్‌లో కొన్నారు. కానీ అది పులి అని తెలిసి భ‌య‌ప‌డ్డారు. అంతేకాదు, వారికి తెలియ‌కుండా చేసిన త‌ప్పు అయిన‌ప్ప‌టికీ వారు జైలు పాల‌య్యారు.

ఫ్రాన్స్‌లోని నార్మండీ ప్రాంతం లి హ‌వ్రెకు చెందిన ఓ జంట 2018లో ఆన్‌లైన్‌లో ఓ యాడ్ చూశారు. స‌వానా జాతికి చెందిన పిల్లి పిల్ల‌ను అమ్ముతామంటూ యాడ్‌లో ఉంది. దీంతో వారు యాడ్‌ను చూసి 7వేల డాల‌ర్లు (దాదాపుగా రూ.5.1 ల‌క్ష‌లు) వెచ్చించి ఆన్‌లైన్‌లో పిల్లి పిల్ల‌ను ఆర్డ‌ర్ చేశారు. అయితే అది పిల్లి కాదు. పులి అని తేలింది.

2 ఏళ్ల పాటు వారు దాన్ని పెంచుకున్నారు. కానీ దానికి పిల్లి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. దీంతో వారికి అనుమానం వ‌చ్చి పోలీసుల‌ను పిలిచారు. వారు నిపుణుల‌కు అప్ప‌గించి ప‌రీక్షించ‌గా, అది పిల్లి కాద‌ని, సుమ‌త్రా దీవుల్లో ఉండే అరుదైన జాతికి చెందిన పులి అని తేలింది. ఆ విషయం ఆ దంప‌తుల‌కు తెలియ‌దు. అయిన‌ప్ప‌టికీ వారిని నేరం చేసిన‌ట్లు భావించి పోలీసులు అరెస్టు చేశారు. సుమ‌త్రా పులి అత్యంత అరుదైన జాతికి చెందిన జీవుల జాబితాలో ఉంది. ప్ర‌స్తుతం ఈ పులి అంత‌రించి పోతున్న జీవుల జాబితాలోకి చేరింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పులులు కేవ‌లం 400 మాత్ర‌మే ఉన్నాయ‌ని డ‌బ్ల్యూడ‌బ్ల్యూఎఫ్ వెల్ల‌డించింది.

అయితే ప్ర‌స్తుతం ఆ పులి ఆరోగ్యంగానే ఉంద‌ని దాన్ని ఫ్రెంచ్ బ‌యోడైవ‌ర్సిటీ ఆఫీస్‌కు త‌ర‌లించామ‌ని పోలీసులు తెలిపారు. అయితే దాంతో ఆ జంట గ‌తంలో అనేక సెల్ఫీలు, వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ తెలియకుండా చేసిన త‌ప్పుకు వారు కూడా అన‌వ‌స‌రంగా జైలు పాలు కావ‌ల్సి వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version