గౌహతి ఫ్యామిలీ కోర్టులో ఓ వింత కేసుకు కోర్టు ఓ వింత తీర్పుని ఇచ్చింది. తన భార్య పాపిడిలో బొట్టు పెట్టుకోలేదని విడాకులకి పిటిషన్ వేస్తే భర్తకు అనుకూలంగా కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేసింది. ఈ విషయం విన్న వాళ్ళు షాక్ అయ్యారు తెలిసిన వాళ్ళు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే… ఓ జంట 2012 ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది అలా సంవత్సరం గడిచింది. కానీ భార్యకు అత్తామామలతో పడకపోయేసరికి జూన్ 2013 లో వేరే కాపురం పెట్టారు. వేరే కాపురం పెట్టిన కొన్ని రోజులకు భార్య భర్తల మధ్య గొడవలు రావడం ప్రారంభం అయ్యాయి. ఆ భార్య భర్తను పట్టించుకునేది కాదు. వారి ఆచారం ప్రకారం పాపిడి లో బొట్టు తప్పనిసరి కేవలం భర్త మరణించినప్పుడే పాపిడి లో బొట్టు తెసేయాలి కానీ ఆ భార్య పాపిడిలో బొట్టు పెట్టుకునేది కాదు చేతికి గాజులు వేసుకునేది కాదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు అయ్యేవి.
దీంతో ఆ భార్య… భర్త పై అత్తమామలపై గృహ హింస కేసు పెట్టింది. కాగా భర్త… భార్య పాపిడిలో బొట్టు చేతికి గాజులు వేసుకోవడం లేదని తనకి తన భార్యతో ఉండటం ఇష్టం లేదని విడాకులు కావాలంటూ కేసు పెట్టాడు. కాగా కోర్టు చేసిన విచారణలో ఆ భార్య పెట్టిన కేసు అవాస్తవం అని భర్త తల్లిదండ్రులు ఊరిలో ఉంటున్నారని తేలడంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది. కోర్టును మబ్యపెట్టే ప్రయత్నం చేసినందుకు కోర్టు ఆ భార్యకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆ కుటుంబం యొక్క ఆచారాల ప్రకారం భార్య బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి అని అది వారి ఆచారం అని తేలింది. కానీ ఆ భార్య బొట్టు పెట్టుకోవడం లేదంటే తనకి తన భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని కోర్టు అంచనా వేసింది. పైగా కొడుకును తల్లిదండ్రులను వేరు చేసినందుకుగాను కోర్టు సూదురు భర్త తరఫున తీర్పును ఇస్తూ విడాకులను మంజూరు చేసింది.