నెల్లూరు జిల్లాలో మాస్క్ వేసుకోకుండా కార్యాలయానికి రావడంపై ప్రశ్నించిన తోటి మహిళా ఉద్యోగిపై అధికారి దాడి చేయడాన్ని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. “దాడికి పాల్పడిన వ్యక్తిని ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదు? మూడ్రోజుల పాటు అతడ్ని కాపాడింది ఎవరు? బాధితురాలికి ఎందుకు రక్షణ కల్పించలేదు? సాధారణ పరిస్థితుల్లో తమను ఆశ్రయించే మహిళల పట్ల కూడా పోలీసుల నుంచి ఇలాంటి స్పందనే ఉంటుందా?
దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఊదరగొట్టారు… ఇప్పుడేం మాట్లాడరేం? ఇది చేతకానితనం కాకపోతే మరేంటి? ఆంధ్రప్రదేశ్ లో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఈ ఘటన ఓ ఉదాహరణ” అంటూ నిశిత విమర్శలు చేశారు. అయితే ఇప్పటికే దీనిపై జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించాయి. అటు పోలీసులు డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను అరెస్ట్ చేశారు.
Usha Rani was attacked on 27th June. The video went viral today. The arrest was made in a hurry. Some questions remain unanswered. Why wasn’t the culprit arrested earlier? Who shielded him for 3 days? Why wasn’t the victim given protection? (1/2) pic.twitter.com/GPrxVuGGin
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 30, 2020