కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (22-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో మంగ‌ళ‌‌‌‌‌వారం (22-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 22nd september 2020

1. ఏపీలో కొత్త‌గా 7,553 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,39,302కు చేరుకుంది. 71,465 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,461 మంది చ‌నిపోయారు. 5,62,376 మంది కోలుకున్నారు.

2. దేశంలో కొత్త‌గా 75,083 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,62,664కు చేరుకుంది. 9,75,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 44,97,868 మంది కోలుకున్నారు. 88,935 మంది చ‌నిపోయారు.

3. తెలంగాణ‌లో కొత్త‌గా 2,166 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,74,774కు చేరుకుంది. 29,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,052 మంది చ‌నిపోయారు. 1,44,073 మంది కోలుకున్నారు.

4. ఢిల్లీలో కొత్త‌గా 3,816 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయిన‌. మొత్తం కేసుల సంఖ్య 2,53,075కు చేరుకుంది. 2,16,401 మంది కోలుకున్నారు. 31,623 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,051 మంది చ‌నిపోయారు.

5. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,337 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,52,674కు చేరుకుంది. 8,947 మంది చ‌నిపోయారు. 4,97,377 మంది కోలుకున్నారు. 46,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

6. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గాను 3వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లోని ప్ర‌భుత్వ సాసున్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో 200 మంది వాలంటీర్ల‌కు టీకాను ఇచ్చారు.

7. ఒడిశాలో కొత్త‌గా 4,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,88,311కు చేరుకుంది. 38,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,49,379 మంది కోలుకున్నారు.

8. క‌రోనా నేప‌థ్యంలో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఇండిగో విమాన‌యాన సంస్థ ప్ర‌త్యేక ఆఫర్‌ను ప్ర‌క‌టించింది. వారికి విమాన టిక్కెట్ల‌పై 25 శాతం ప్ర‌త్యేక త‌గ్గింపును ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

9. క‌రోనా వైర‌స్‌ను సృష్టించి ప్ర‌పంచ దేశాల‌కు దాన్ని వ్యాపింప‌జేసిన చైనాపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్య‌రాజ్య‌స‌మితికి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రాణాంతక వైర‌స్ వ్యాప్తికి చైనాయే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు.

10. గ‌డిచిన వారం రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త‌గా 20 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంత‌కు ముందు వారంతో పోలిస్తే ఈ వారంలో క‌రోనా కేసుల సంఖ్య 6 శాతం వ‌ర‌కు పెరిగింద‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news