కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో బుధవారం (23-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. ఈ నెల 11న ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో ఆయన కన్నుమూశారు.
2. ఏపీలో కొత్తగా 7,228 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,43,635కు చేరుకుంది. 5,506 మంది చనిపోయారు. 70,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,67,772 మంది కోలుకున్నారు.
3. ఏపీ సచివాలయంలో కొత్తగా 6 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా బారిన పడ్డ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఖ్య 163కి చేరుకుంది. ఇటీవలే ఒక అధికారి కరోనా బారిన పడి చనిపోగా, మంత్రుల పేషీల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
4. ఐక్యరాజ్యసమితితోపాటు దాని అనుబంధ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా టీకాలను ఉచితంగా అందిస్తామని రష్యా ప్రకటించింది. తమ స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని తెలియజేసింది.
5. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,64,198కి చేరుకుంది. 2,33,71,496 మంది కోలుకున్నారు. 9,74,559 మంది చనిపోయారు.
6. దేశంలో కొత్తగా 83,347 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 56,46,011కు చేరుకుంది. 9,68,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 45,87,614 మంది కోలుకున్నారు. 90,020 మంది చనిపోయారు.
7. తెలంగాణలో కొత్తగా 2,296 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,77,070కి చేరుకుంది. 1,062 మంది చనిపోయారు. 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,46,135 మంది కోలుకున్నారు.
8. సైబీరియాలోని వెక్టార్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఎపివాక్ అనే కరోనా వ్యాక్సిన్‌ను అక్టోబర్ 15 వరకు అందుబాటులోకి తెస్తామని రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ తెలిపింది.
9. దేశంలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. కోవిడ్ 19కు గాను ఆయా రాష్ట్రాలు టెస్టింగ్ ఎక్కువగా చేయాలని, వీలైనంత ఎక్కువ మందికి చికిత్స అందించాలని అన్నారు.
10. మహారాష్ట్రలో కొత్తగా 21,029 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12,63,799కు చేరుకుంది. 33,886 మంది చనిపోయారు. 9,56,030 మంది కోలుకున్నారు. 2,73,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి.