విదేశాలకి వెళ్లే వాళ్లకి జులై 22న కోవిషీల్డ్ రెండవ డోసు…!

-

విదేశాలకి వెళ్లి చదువుకునే వాళ్ళకి మరియు ఉద్యోగులకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండవ డోసు జులై 22న వేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ డాక్టర్ సి ఎం అశ్వంత్ నారాయణ ఈ సమాచారాన్ని ఇచ్చారు.

అయితే ఎవరైతే విదేశాలకి వెళ్తున్నారో వాళ్లకి వ్యాక్సిన్ వేస్తామని.. సెంట్రల్ కాలేజీ బెంగుళూరు లో దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొదటి డోస్ 1500 విద్యార్థులకి ఇచ్చారు. ఇది ఇలా ఉంటే రెండవ డోస్ విదేశాలకు వెళ్లే ప్రయాణికులు కి మొదటి డోసు వేయించుకున్న 28 రోజులులోగ ఇస్తారని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇది జరుగుతోందని అన్నారు.

సెల్ఫ్-ప్రొక్లెమేషన్ లెటర్ తో పాటు మిగిలిన డాక్యుమెంట్ ని కూడా వెరిఫై చేయాలని అర్హత ఉండే వాళ్ళు తప్పక వీటిని చూపించాలని అన్నారు. వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్లేటప్పుడు తప్పకుండా కన్ఫర్మేషన్ లెటర్ అప్లోడ్ చేయాలి. మొదటి డోసు గతంలో తీసుకున్న వాళ్ళు పాస్ పోర్ట్ నెంబర్ ని రెండో డోస్ తీసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news