దరిద్రుడా.. ఫోన్ పగలగొట్టు: ఫాన్స్ పై మంగ్లీ ఉగ్రరూపం!

-

తెలంగాణ సింగర్ మంగ్లీ.. గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు జానపద గీతాలు పాడే మంగ్లీ.. ఇప్పుడు సినీమా పాటలతో అందరినీ అలరిస్తోంది. జానపద పాటలతో కెరీర్ ప్రారంభించిన… సింగర్ మంగ్లీ ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ సింగర్ గా మారిపోయింది. మాస్ పాటలతో పాటు ఐటమ్ సాంగ్స్ పాడుతూ యువతకు మత్తెక్కిస్తోంది సింగర్ మంగ్లీ. ఇది ఇలా ఉండగా తాజాగా సింగర్ మంగ్లీ కి ఊహించని ఘటన ఎదురైంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో సింగర్ మంగ్లీ కి సెల్ఫీల సెగ తగిలింది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె పెళ్లి రిసెప్షన్కు మంగ్లీ ముఖ్య అతిథిగా హాజరైంది. అయితే అక్కడ మంగ్లీ తో సెల్ఫీ దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.

ఒక్కసారిగా ఫోటోల కోసం ఫ్యాన్స్ హంగామా చేయడంతో తట్టుకోలేక అటూ ఇటూ పరుగులు పెట్టింది ముంగిలి. ఇక చేసేదేమీ లేక ఆ యువకుల పై ఫైర్ అయ్యింది సింగర్ మంగ్లీ. ఓ దరిద్రుడా… ఫోన్ పగలగొట్టు అంటూ ఫ్యాన్ పై మంగ్లీ ఉగ్రరూపం చూపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె అభిమానుల పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version