ఆవుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులు..ఏ రాష్ట్రంలో తెలుసా..?

-

ఆవుల చికిత్స కోసం యూపీ సర్కార్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా ఆవులకు వైద్యం కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించింది. తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్న ఆవుల కోసం ఆవుల అంబులెన్స్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర పాడ పరిశ్రమ, పశుసంవర్థక శాక మంత్రి లక్ష్మీ నారాయన్ చౌదరి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 515 అంబులెన్స్ లను సిద్ధం చేశారు. దేశంలోనే ఆవుల కోసం అంబులెన్స్ సర్వీసులను మొదటిసారి అని మంత్రి అన్నారు. మథుర సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆవుల అంబులెన్స్ ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి చౌదరి వివరించారు. ఫోన్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లోనే వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులతో కూడిన అంబులెన్స్ అనారోగ్యంతో బాధపడుతున్న ఆవుల వద్దకు చేరకుంటుందని మంత్రి వెల్లడించారు. డిసెంబరు నాటికి ఈ పథకం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం లక్నోలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఉచితంగా నాణ్యమైన వీర్యం అందిండంతో యూపీ రాష్ట్రంలో ఆవుల జాతి అభివృద్ధి కార్యక్రమం మరింత ఊపందుకుంటుందని చౌదరి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news