ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం : పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

-

ఎయిడెడ్ సంస్థల విలీన నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీన ప్రక్రియపై తాజాగా మరోసారి వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు పవన్ కళ్యాణ్. ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేస్తోంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకల హజబ్బ స్కూలుని కట్టారని చురకలు అంటించారు. పండ్లు అమ్మిన డబ్బుతో హరేకల హజబ్బ స్కూలును ఎలా నిర్మించగలిగారు..? అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

pawan kalyan ys jagan

ఇక అంతాకు ముందు అప్పుడు అమ్మ ఒడి. ఇప్పుడు అమ్మకానికో బడి అంటూ సెటైర్లు పేల్చారు. విద్యార్ధుల భవిష్యత్తును పూర్తిగా గాలికి వదిలేశారని.. ఎయిడెడ్ స్కూళ్ల విలీన నిర్ణయంతో విద్యార్థులే బలి పశువులుగా మారారని మండిపడ్డారు. విద్యార్థుల విషయంలో వారి భవిష్యత్తును నాశనం చేస్తూ ఎందుకు వైసీపీ ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరించింది? వీటిలో ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు పని చేస్తున్నాయి..? అని అగ్రహించారు పవన్ కళ్యాణ్.

ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంతో కలుపుకొనేందుకు లేదా స్వాధీనపర్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా సమయంకాని సమయంలో ప్రభుత్వం ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో విద్యార్థులను సమస్యల్లోకి నెట్టివేస్తోందని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news