బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవలే పూర్తికాగా త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. ఈసారి బిగ్ బాస్ ను ఓటీటీలో ప్రసారం చేయబోతున్నట్టు ఇప్పిటికే నిర్వాహకులు ప్రకటించారు. అంతే కాకుండా బిగ్ బాస్ ఓటిటి 24 గంటల పాటూ ప్రసారం చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోంది.ఇప్పిటికే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవారిలో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. టిక్ టాక్ దుర్గారావు, రఘుమాస్టర్, సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సహా మరికొందరు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇంతటి క్రేజ్ ఉన్న బిగ్ బాస్ పై సీపీఐ నారాయణ గతంలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే అది బిగ్ బాస్ షో కాదని బ్రోతల్ హౌస్ అని నారాయణ ఆరోపించారు. ఇక తాజాగా మరోసారి నారాయణ బిగ్ బాస్ హౌస్ పై నాగార్జున పై మండిపడ్డారు. నాగార్జున అంటే తనకు కోపం కాదని అసహ్యం అని అన్నారు. ఎవరిని పెళ్లి చేసుకుంటావ్..ఎవరితో డేటింగ్ చేస్తావ్..ఎవరిని ముద్దు పెట్టుకుంటావ్…ఇదేనా బిగ్ బాస్ అంటే అంటూ మండిపడ్డారు.
అంతే కాకుండా తాను ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు శాలువా కప్పారని అప్పుడు తాను దండం పెట్టగా ఆ ఫోటోలను తీసి ట్రోల్స్ చేశారని అన్నారు. కమ్యూనిస్టులు అంటే గడ్డం పెంచుకుని మాసిన బట్టలు..చిరిగిన చెప్పులు ధరించి ఉండాలనుకుంటారని అది భ్రమ అని వ్యాఖ్యానించారు. చిన జీయర్ తో పాటూ రకరకాల వారు తమకు కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని చెప్పేవారని అన్నారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ గురించి తనకు తెలుసు అని తమ పార్టీవాళ్లకు తెలియాలని వ్యాఖ్యానించారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని జగన్ చిన్న పిల్లవాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.