బిగ్‌బాస్ బ్రోతల్ హౌస్ లాంటిదే : CPI నారాయణ

-

బిగ్ బాస్ బ్రోతల్ హౌసేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి వివాదాస్పద వాక్యాలు చేశారు. ‘ఏ సంబంధం లేని 20, 30 మంది ఒకే ఇంట్లో ఉండడం ఏంటి? దీనిని ఏమనాలి? బిగ్ బాస్ నాకు అనైతికంగా అనిపించింది. ఉద్దేశపూర్వకంగా నేను వివాదం చేయడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ ఈ షోపై నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షోలో ఆశ్లీలత ఉందని… టాస్కుల పేరిట అసభ్యకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

అలాగే ఒకే జెండాగా ఉందామని నేను మొదటి నుంచి చెబుతున్నా… కలిసిపోదామని సీపీఐ పెడుతున్న ప్రతిపాదనకు సీపీఎం అంగీకరించడంలేదన్నారు నారాయణ. తమ పార్టీతో ఏం సంబంధంలేని వారికి ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్లు అమ్ముకుందని ఫైర్‌ అయ్యారు. కోటి రూపాయలకు ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్లు అమ్ముకుంది. టికెట్లు అమ్ముకున్నారు.. అన్నింటికీ ఆధారాలు దొరకవు అన్నారు. కోటి రూపాయలా, 10 లక్షలా అనేది నిరూపించలేను కానీ.. డబ్బులకు టికెట్లు అమ్ముకున్న మాట వాస్తవం అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news