‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్ర బృందం ప్రకటించింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఒకరోజు ముందే 19న FearSongను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. FearSong మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది’ అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న మాస్ పోస్టర్ను జత చేశారు.

కాగా,ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news